ఎబోలా నుంచి బయటపడ్డామనుకుంటే... కరోనా తిష్టవేసింది... 

ఎబోలా నుంచి బయటపడ్డామనుకుంటే... కరోనా తిష్టవేసింది... 

కాంగో అంటే గుర్తుకు వచ్చేది ఎబోలా.  ఎబోలా అంటే అందరికి గుర్తుకు వచ్చేది కాంగో.  1953 వ సంవత్సరంలో మొదలైన ఈ ఎబోలా తరువాత  కాంగోలో విపరీతంగా వ్యాపించింది.  కాంగో మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ విలయతాండవం సృష్టించింది.  అయితే, ఎబోలా వైరస్ ఇప్పుడు అక్కడ తగ్గుముఖం పట్టింది.  42 రోజుల్లో ఒక్క వైరస్ కేసు కూడా నమోదుకాకపోవడంతో కాంగోను ఎబోలా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  

దీంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇపుడు ఆఫ్రికా దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతున్నది.  ఒక్క అంటార్కిటికా ఖండం తప్పించి మిగతా ఆరు ఖండాల్లో ఈ వైరస్ వ్యాపించింది.  ఆఫ్రికా దేశంలో మొదట నైజీరియాలో మాత్రమే ఉన్నది.  వెంటనే ఆ దేశం ట్రావెలింగ్ పై నిషేధం విధించింది. కానీ, ఆ దేశంలో జరగాల్సిన నష్టం జరిగింది.  క్రమంగా ఈ వైరస్ ఆఫ్రికా ఖండంలోని మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపించింది.  ఇప్పుడు ఆఫ్రికాలోని అన్ని దేశాలలో దీని ప్రభావం కనిపిస్తోంది.  ప్రతి దేశంలో ఒకటి లేదా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు.  ముందు జాగ్రత్తగా అన్ని దేశాలు స్కూల్స్, కాలేజీలు బంద్ చేయడమే కాకుండా అన్నింటిపై నిషేదాజ్ఞలు విధిస్తున్నాయి.  విమానాలను రద్దు చేసుకుంటున్నాయి.  అంతర్జాతీయ సరిహద్దులను మూసేస్తున్నాయి.  మిగతా వైరస్ ల కంటే కరోనా భిన్నంగా ఉండటంతో పాటుగా బలంగా కూడా ఉండటంతో దీనిని తక్కువుగా అంచనా వేయకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.