కాస్త తగ్గినా అదేజోరు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

కాస్త తగ్గినా అదేజోరు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

లాక్‌డౌన్ కొనసాగుతున్నా భారత్‌లో కరోనా పంజా విసురుతూనే ఉంది.. రెండు రోజులు భారీగా నమోదు అయ్యాయి పాజిటివ్ కేసులు.. సోమవారం ఒకేరోజు 4,213 కేసులు నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదేతొలిసారి. అయితే, ఇవాళ మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,604 పాజిటివ్‌ కేసులతో పాటు,  87 మంది  మృతి చెందారు.. దేశంలో ఆంక్షలు సడలించిన తర్వాత కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం.. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 “కరోనా” పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు “కరోనా” కారణంగా దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 2,293కు పెరిగింది. ఇక, తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి.. 

కరోనా కేసులు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిస్తే.. 
* మహారాష్ట్ర: 23,401 పాజిటివ్ కేసులు, 868 మంది మృతి
* గుజరాత్‌: 8,542 పాజిటివ్ కేసులు, 513 మంది మృతి
* తమిళనాడు: 8,002 పాజిటివ్ కేసులు, 53 మంది మృతి
* ఢిల్లీ: 7,233 పాజిటివ్ కేసులు, 73 మంది మృతి
* రాజస్థాన్‌ : 3,988 పాజిటివ్ కేసులు, 113 మంది మృతి
* మధ్యప్రదేశ్‌: 3,785 పాజిటివ్ కేసులు, 221 మంది మృతి
* ఉత్తరప్రదేశ్‌: 3,573 పాజిటివ్ కేసులు, 80 మంది మృతి
* పశ్చిమబెంగాల్‌: 2,063 పాజిటివ్ కేసులు, 190 మంది మృతి
* ఆంధ్రప్రదేశ్‌: 2,018 పాజిటివ్ కేసులు, 45 మంది మృతి
* పంజాబ్‌: 1,877 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి
* తెలంగాణ: 1,275 పాజిటివ్ కేసులు, 30 మంది మృతి
* జమ్మూకశ్మీర్‌: 879 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి
* కర్ణాటక: 862 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి
* హర్యానా: 730 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి