మేడారం జాతరలో కరోనా కలకలం..
మేడారం మినీ జాతరలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి... ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... మరికొంతమందికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో.. వారిని క్వారంటైన్లో ఉంచాలని సూచించారు. మరోవైపు, కరోనా కేసులతో అప్రమత్తమైన అధికారులు.. భక్తుల రక్షణకోసం చర్యలు తీసుకుంటున్నారు. మేడారం జాతర తరహాలో కాకపోయినా.. మినీ జాతరకు కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.. ఇదే సమయంలో ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో.. వారి హోం ఐసోలేషన్‌లో పెట్టారు.. వారితో సన్నిహితంగా మెలిగినవారికి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు అధికారులు.. అంతేకాదు.. మరికొన్ని కరోనా కేసులు కూడా ఉండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. సాధారణ భక్తుల్లో ఎవరికి కరోనా ఉందో అనే భయం కూడా అక్కడి సిబ్బందిలో నెలకొంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)