కరోనా పంజా.. 190 దేశాలకు విస్తరణ.. 14 వేలు దాటిన మృతులు

కరోనా పంజా.. 190 దేశాలకు విస్తరణ.. 14 వేలు దాటిన మృతులు

కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీలో పుట్టిన ఈ మాయదారి వైరస్ క్రమంగా ఇతర దేశాలకు పాకుతూనే ఉంది.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 190 దేశాలకు విస్తరించింది కరోనా.. ఇక ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన 3,34,981 మంది పడగా... 14,652 మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం.. దేశాలకు విస్తరిస్తూ ముందుకు సాగుతుండడంతో.. ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. ఈ వైరస్ విజృంభిస్తూనే ఉంది.