గ్రామీణ ఆరోగ్యానికి కరోనా కొత్త సవాల్..ఎలా అంటే..!

గ్రామీణ ఆరోగ్యానికి కరోనా కొత్త సవాల్..ఎలా అంటే..!

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు... సరిగ్గా వారం క్రితం రోజుకు వందల్లో నమోదైన కేసులు, లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత రోజుకు 6వేలు దాటి 7 వేల చొప్పున పెరుగుతూ పోతున్నాయి...కరోనా మహమ్మారి ఇప్పుడు భారత దేశానికి సవాల్‌ విసురుతుంది..లాక్‌డౌన్‌లో వైరస్‌ను నాశనం చేయవచ్చని గోప్పగా చెప్పిన పాలకులు ఇప్పడు దాని ఉధృతిని చూస్తూ ఉండిపోతున్నారు తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడం లేదు..దేశంలో అంతంత మాత్రమే ఉన్న వైద్య రంగం,కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తన సామర్థ్యానికి మించిన బరువు బాధ్యతలను మోస్తోంది..
వైరస్ బారిన పడినవారి కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య భద్రతా వ్యవస్థపై ఒత్తిడి అధికమవుతోంది...కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ ఆరోగ్య వ్యవస్థకు మరో సవాల్ విసరనుంది..ఇప్పటేకే తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్న ఆరోగ్యశాఖ వచ్చే వర్షకాలంలో భయంకర అంటు వ్యాధుల రూపంలో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది...
దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో డాక్టర్లు పూర్తిగా నిమగ్నమయ్యారు...అనేక ఇతర వ్యాధులకు చికిత్స చేయడం లేదు...దీంతో భవిష్యత్‌లో చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సంక్షోభం తప్పదనిపిస్తుంది....క్షయ, హృద్రోగాలు, రక్తపోటు మొదలైన రుగ్మతలతో బాధపడుతున్న సంఖ్యానేక భారతీయులకు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.. కరోనా వ్యాప్తి వల్ల చాలా ఆసుపత్రిలో ఓపి సేవలు అసాధ్యమైపోతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు పూర్తి స్తంభించిపోయాయి...మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే ప్రతినెలా ఈ దేశంలో జన్మించే లక్షలాది పసిబిడ్డల యోగక్షేమాలకు భరోసా కొరవడడం..
చిన్న పిల్లలపై భవిష్యత్ కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ దేశాలను హెచ్చరించాయి...కరోనా వైరస్‌ పిల్లల జీవన విధానంపై ఉంటుందని ఒక నివేదికలో పేర్కోన్నది...కరోనా సంక్షోభం వల్ల దేశాలకు ఆర్థిక సహయం చేయలేమని వచ్చే సంవత్సరం వైద్యం కోసం ఆయా ఆయా దేశాలు సొంతంగానే నిధులు సమకూర్చుకోవాలి తెలిపింది...పోలియో వంటి వ్యాధులకు కూడా నిధుల కొరత ఉందని తెలిపింది...ఈ లాంటి సమయంలో వైద్య రంగంపై దేశం మరింత దృష్టికేంద్రీకరించాలి...బడ్జెట్‌లో నిధుల కేటాయింపును పెంచాలి...
మరోవైపు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను మరింత పెంచాలి...గ్రామాల్లో ఆరోగ్య సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఉంది...కరోనాతో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న జౌళి పరిశ్రమలు, విమానయానం, పర్యాటకం, ఆతిథ్య రంగాలు మహమ్మారి మూలంగా కుదేలుకావడంతో...కోట్లాది కూలీలు, చేతి వృత్తుల వారికి ఎటువంటి పని లేకుండాపోవడం, ఆదాయం కొరవడి ఆకలిదప్పులతో అలమటిస్తూ అందరు గ్రామాల బాట పట్టారు..వారికి వచ్చే వర్షకాలంలో కరోనాతో పాటు అనేక  సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది..ఇప్పటి వరకూ పట్టణ అభివృద్దిపై, పట్టణాలలోనే వైద్య రంగానికి దోహదపడ్డ ప్రభుత్వాలు ఇప్పుడు గ్రామీణ ఆరోగ్యంపై ముందస్తూ నిర్ణయాలు తీసుకోకపోతే పల్లేలు స్మశానంగా మారుతాయి.
వందలాది మైళ్ళ దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకన పయనమైన లక్షలాది వలస కార్మికులకు వర్షాలు మొదలు కాగానే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..కరోనా పీడిత భారతదేశం భవిష్యత్తులో ఒక మహా మానవతా సంక్షోభంలోకి నెట్టబడుతాం...ఇప్పుడు గ్రామాలు వలసకార్మికులతో నిండిపోతున్నాయి..పట్టణాల్లో ఉపాధి కోల్పోయి,గ్రామాల్లో ఉపాధి లేక, దానికితోడు పేదరికం,కరోనా,ఇతర సీజనల్‌ వ్యాధుల విజృంభనతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవడం  అసాధ్యం..
ఒక అంతర్జాతీయ నివేదిక ప్రకారం ప్రజలు,ముఖ్యంగా మనలాంటి వర్తమాన దేశాలు ప్రజా వైద్యంపై చేసే ఖర్చు చాలా తక్కువ...జీడిపీ కేవలం 3శాతం మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది...అందులో ఖర్చు చేసేది ఇంకా చాలా తక్కువ..ఇది ఇలాగే ఉంటే ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండదు..పేదరికంలో దాదాపు 80కోట్ల ప్రజలు వైద్యానికి చేసే ఖర్చుతో వారు మరింత పేదరికంలో పోయే ప్రమాదం ఉంది...దేశంలో ప్రజలు వారి సంపాదిస్తున్న దానికంటే వైద్యానికి చేసే ఖర్చు ఎక్కువగా ఉందని సర్వే చేప్పింది..
 ప్రభుత్వాలు వచ్చే వర్షకాలంలో ప్రభలే అంటువ్యాధులపై పోకస్ పెట్టాలి,గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేయాలి...సరిపోను వైద్యులు,మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలి...వ్యాధులపై ప్రజల్లో అమగాహణ కల్పించాలి...ప్రతి విషయంలో చైనాతో పోల్చి చెప్పే పాలకులు ఇప్పుడు చైనా వైద్య విధానంపై అధ్యాయనం చేసి సరియైన నిర్ణయాలు తీసుకోవాలి..గ్రామీణ భారతాన్ని సవాల్‌ చేయబోతున్న కరోనాను ముందుచూపుతో దాన్ని ఎదుర్కొవాలి..గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అలాంటి గ్రామాలలో కరోనా వ్యాప్తి చెందితే అది దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థపై చాలా ప్రభావితం చూపిస్తుంది..