కరోనా ఎఫెక్ట్‌... 12 రైళ్లు రద్దు, ప్లాట్‌ ఫామ్‌ టికెట్ ఇక రూ.50..

కరోనా ఎఫెక్ట్‌... 12 రైళ్లు రద్దు, ప్లాట్‌ ఫామ్‌ టికెట్ ఇక రూ.50..

డ్రాగన్ కంట్రీలు పుట్టి... ప్రపంచ దేశాలకు వణికిస్తోన్న కరోనా వైరస్.. ఇప్పుడు భారత్‌లోనూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో, అన్నిరాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా భారత రైల్వే శాఖతో పాటు, దక్షిణ మధ్య రైల్వే కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కు పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకోగా... దేశంలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే మొత్తం 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్ ‌ఫామ్ లకు ఈ ధర వర్తింపజేయనున్నారు. రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది రైల్వే శాఖ. మరోవైపు.. 12 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే... రైళ్లకు సంబంధించిన వివరాలను కింది టేబుల్‌లో చూడవచ్చు...