తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.  తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526కి చేరింది.  ఇందులో 2,50,453 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,643 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1430కి చేరింది.  నిన్న ఒక్కరోజే 1296 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 51,34,335 కరోనా నిర్ధారణ  పరీక్షలు నిర్వహించారు.