ప్యాకేజీలు కంపెనీలకు... జీతాల కోతలు కార్మికులకు?

ప్యాకేజీలు కంపెనీలకు... జీతాల కోతలు కార్మికులకు?

ములిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే కాబోలు...ప్రపంచ నూతన ఆర్థిక విధానాలతో కార్మికుల జీవితాలు చిన్నభిన్నమైన తరునం..ఇప్పుడు కరోనాతో వైరస్‌తో కార్మికుల జీవితాలు అతలాకుతులం అవుతున్నాయి..లాక్‌డౌన్‌లో ప్రపంచ వ్యాప్తంగా వస్తు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది...అనేక సంస్ధలు మూతపడ్డాయి..వేతనాల్లో కోతలు.. ఉద్యోగాల తొలగింపుతో కార్మికులు రోడ్లమీద పడ్డారు...

ఈ సమయంలో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం తమ కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తూ కార్మికుల పట్ల అభిమానం, వృత్తి విలువలు పాటిస్తున్నారు...మన దేశంలో ప్రజలు,కంపెనీ పరిస్థితి మరి క్లిష్టంగా ఉంది... ప్రభుత్వం అనేక కంపెనీలకు లక్ష 70 లకుపైగా  కరోనా ఉద్ధీపాన ప్యాకేజీలు ప్రకటించింది...

ఈ ఉద్దీపాన ప్యాకేజీలు కార్పోరేట్ సంస్ధలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కాని ఆ కార్పోరెట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు మాత్రం ఉపయోగం లేకుండా పోయింది...కార్పోరేట్ కంపెనీలకు ప్రభుత్వాలకు మధ్య ఉండే అవినాభావ సంబంధంపై ముఖ్యంగా కార్సోరేట్ కంపెనీల ఎత్తుగడలు సాధారణ జనానికి అర్థంకాని రహస్యమే..

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కంపెనీలకు చాలా నష్టాలు వస్తున్నాయని  ప్రకటిస్తున్నాయి..పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉన్న కొద్దిమందికి కోతలు విధించి జీతాలిస్తున్నారు. బడా బడా కార్పొరేట్‌ కంపెనీలు సైతం ఉద్యోగాల తొలగింపు, వేతనాల్లో కోతలు చేపట్టాయి. అయితే ఈధోరణికి భిన్నంగా 'పీఎం కేర్స్‌'(కరోనా రిలీఫ్‌ ఫండ్‌) నిధికి, సీఎంల సహాయనిధికి  కార్పొరేట్‌ వర్గం నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి..

అనేక కార్పోరేషన్లు, ప్రభుత్వం సంస్థల్లో కూడా అదే విధానం అమలు అవుతుంది..రాజకీయ పార్టీలు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు పెద్ద మొత్తం విరాళాలు ప్రకటిస్తున్నారు...రాజకీయ నాయకుల గురించి అయితే  ఇక చెప్పనవసరమే లేదు...ప్రజల సొమ్ములతో జీతాలు తీసుకుంటూ అవి మళ్ళీ విరాళం ఇస్తూ గొప్పలు చెపుకుంటున్నారు...వారి సొంత డబ్బు ఇచ్చిన నాయకుడు దేశంలో ఒక్కరు కూడా లేరు...అనేక బడా కార్పోరేట్ సంస్థలు కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులు కారణంగా చూపి ఈ సంస్థలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల్ని ఉన్నఫళంగా తొలగిస్తున్నారు, అదే సమయంలో మరోవైపు కోట్ల రూపాయాలు పీఎం కేర్స్‌కు,సీఎంల నిధికి విరాళాలు అందజేస్తున్నాయి..

ఇటీవలే ఆర్థికంగా బలంగా మారుతున్న బడా కార్పొరేట్‌ సంస్థ కథ మరోలా ఉంది... మార్కెట్‌ సంక్షోభంలో ఉన్నా, ఆ సంస్థలో అనేక అంతర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. ఆర్థిక మనుగడ బలంగా ఉన్నప్పటికీ, అందులోనూ ఉద్యోగాల కోత, వేతనాల్లో కోతలు అమలుజేశారు. పెట్రో ఉత్పత్తుల వ్యాపారంలో ఉద్యోగులకు ఇవ్వాల్సినదాంట్లో అనేకచోట్ల కోతలు పెట్టారు. ఇదిలా కొనసాగుతుండగానే పీఎం కేర్స్‌కు దాదాపుగా రూ.500కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించింది...ఎయిర్‌ ఇండియాలో కూడా కోతలు ఉంటాయని ఇటీవల ప్రకటించింది..ఇంకా అనేక వ్యాపార్ సంస్థలు ఆయా రాష్ట్రాల సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్నాయి..

ఇలా బడా కార్పోరేట్ సంస్థల భారీ విరాళాలతో దేశ ప్రజల్లో అనేక సందేహాలు పెరుగుతున్నాయి..ఆర్థికంగా వర్తక వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటే కార్పొరేట్లు పీఎం కేర్స్‌కు భారీ విరాళాలు ఎలా ప్రకటిస్తున్నాయి?, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా భారీ విరాళాలు ఎలా ఇస్తున్నారు?...దీనివెనుకున్న మతలబేంది? అన్నది చర్చనీయాంశమైంది...ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతూ విరాళాలు ఇస్తున్నారనే  చర్చకూడా ప్రకజల్లో మొదలైంది...కాని మోడీ సర్కార్‌-కార్పొరేట్‌ వర్గాలకు మధ్య ఉన్న ఈక్వేషన్‌ సాధారణ ప్రజలకు అర్థం కానిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు... ప్రతి కార్పొరేట్‌ సంస్థకు ఒక నిర్దిష్టమైన 'కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ' (సీఎస్‌ఆర్‌) అనేది ఉంటుందని, అదిప్పుడు పీఎం కేర్స్‌ ఖాతాలో వేస్తున్నారని తెలుస్తున్నది...

భారత ప్రభుత్వం దేశంలో ఉన్న కంపెనీలు నష్టపోకుండా ఉండడానికి,అందులో పని చేస్తున్న కార్మికుల జీతాల్లో కోతలు పెట్టకుండా ఉండడానికే కదా ప్రజల సొమ్మును ఉద్ధీపన ప్యాకేజీల పేరుతో కార్పోరెట్ సంస్థలకు ఇస్తున్నది అని ప్రశ్నిస్తున్నారు సాధారణ ప్రజలు..ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో లబ్దిపొందుతూ మరో వైపు కార్పోరెట్ కంపెనీలు కార్మికులను రోడ్లపైకి నెట్టుతున్నాయి..కేంద్రం కరోనా ప్యాకేజీలు కార్పోరేట్ సంస్ధలకు కాకుండా కార్మికులకు ప్రకటించాలిని, కంపెనీలకు ప్రకటించే కరోనా ప్యాకేజీలో 50 శాతం కార్మికుల జీతాలకు మాత్రమే కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి...