కరోనా దెబ్బకు పాక్ విలవిల... భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు... 

కరోనా దెబ్బకు పాక్ విలవిల... భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు... 

కరోనా ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.  ఇప్పటికే ఈ కరోనా వలన ప్రపంచవ్యాప్తంగా 7100 మందికి పైగా మరణించారు.  1,82,000 మంది కరోనా వలన బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం ఇండియాలో 126 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ముగ్గురు మరణించారు.  చైనా తరువాత అత్యంత ఎక్కువ మరణాలు నమోదు చేసుకున్న దేశం ఇటలీ.  

ఇటలీలో ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.  అటు ఇరాన్, ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల్లో కూడా ఈ సంఖ్య పెరిగిపోతున్నది.  ఇదిలా ఉంటె, మన పొరుగుదేశం పాకిస్తాన్ లో రెండు రోజుల క్రితం వరకు కేవలం 20 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి.  అయితే, ఈ రెండు రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది.  మొత్తం ఇప్పటి వరకు అక్కడ 189 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇరాన్ బోర్డర్ లో ఉన్న సింధ్ ప్రావిన్స్ లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.  అక్కడ ఏకంగా 155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  సార్క్ దేశాల్లో బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ, బలహీనమైన రాజకీయ వ్యవస్థ కలిగిన దేశం పాక్.  మరి ఈ సమస్యను పాక్ ఎలా అధికమిస్తుందో చూడాలి.