కడప జైలులో కరోనా కలకలం... 317 మంది  ఖైదీలకు పాజిటివ్ 

కడప జైలులో కరోనా కలకలం... 317 మంది  ఖైదీలకు పాజిటివ్ 

నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తక్కువగా నమోదైనా, ఈరోజు కేసుల సంఖ్య అమాంతంగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షలు దాటిపోయింది.  ఇక ఇదిలా ఉంటె, రాయలసీమలోని కడప జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కడప జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 18086 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే జిల్లాలో 755 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  అటు కడప సెంట్రల్ జైల్లో కరోనా కలకలం రేగింది.  కడప సెంట్రల్ జైల్లో ఖైదీలు, సిబ్బంది కలిపి మొత్తం 703 మంది ఉండగా, మూడు విడతల్లో అందరికి టెస్టులు నిర్వహించారు.  ఈ టెస్టుల్లో 317 మంది ఖైదీలకు, 14 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన ఖైదీలను రెండుబ్లాకుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.