కడప సెంట్రల్ జైల్లో కరోనా కలకలం... 19 మందికి పాజిటివ్... 

కడప సెంట్రల్ జైల్లో కరోనా కలకలం... 19 మందికి పాజిటివ్... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  వారు వీరు అనే తేడా లేకుండా కరోనా ఎవర్ని వదలడం లేదు.  కడప జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే ఆ జిల్లాలో 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  నమోదైన 14,061 కేసుల్లో 7207 మంది డిశ్చార్జ్ అయ్యినట్టు తెలుస్తోంది.  ఇక 6706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇకపోతే ఇప్పటి వరకు కడప జిల్లాలో కరోనా కారణంగా 148 మంది మరణించారు.  

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు కడపజిల్లా సెంట్రల్ జైల్లో కరోనా కలకలం రేగింది.  జైల్లోని ఖైదీల్లో 19 మందికి కరోనా సోకింది.  దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  వైరస్ సోకిన 19 మందిని ఫాతిమా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఇక జైలును పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.  మిగతా ఖైదీల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.