అయోధ్య ఆలయంలో కరోనా కలకలం: 16 మందికి పాజిటివ్
ఆగష్టు 5 వ తేదీన అయోధ్య రామాలయంలో భూమి పూజ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అయోధ్య రామాలయంలో కరోనా కలకలం సృష్టించింది. అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారి ఆచార్య సతేంద్ర దాస్ శిష్యుడు ప్రదీప్ దాస్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. దీంతో ప్రదీప్ దాస్ ను కరోనా ఆసుపత్రికి తరలించారు. శిష్యుడు ప్రదీప్ దాస్ కు కరోనా సోకడంతో, ప్రధాన అర్చకుడు సతేంద్ర దాస్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో ప్రధాన అర్చకుడు సతేంద్ర దాస్, శిష్యుడు ప్రదీప్ దాస్ లు భూమి పూజకు హాజరు కాలేకపోవచ్చని ఆలయ ట్రస్ట్ తెలియజేసింది.
పూజారితో పాటు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 15 మంది సిబ్బందికి కరోనా సోకింది. వీరంతా ఆలయంలో భద్రతా పరమైన విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో ఆలయాన్ని, ఆలయ చుట్టుపక్కల ప్రదేశాలను శానిటైజ్ చేస్తున్నారు. ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు ప్రధానితో పాటు 50 వీవీఐపీలు, మరో 150 మంది గెస్టులు అధికారులు ఈ భూమి పూజకు హాజరుకాబోతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)