నిమిషానికి వెయ్యి ... ఇలాగైతే కష్టమే...!!
కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రపంచంలో దాదాపుగా 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈకరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచంలోని చాలా దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున ఐదు లక్షల వరకున్న పాజిటివ్ కేసులు ఈరోజుకు వచ్చే సరికి ఆరు లక్షలు దాటిపోయింది. నిమిషానికి వెయ్యి చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే, ఈ కేసులు ఇలానే పెరిగిపోతుంటే అడ్డుకట్ట వేయడం చాలా కష్టం అవుతుందని నిపుణులు అంటున్నారు. అమెరికాలోని పాజిటివ్ కేసులను చూస్తుంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. ఎప్పటి వరకు అక్కడ ఈ సంఖ్య కంట్రోల్ అవుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఈ సంఖ్య ఇలానే పరిగితే ఒక్క అమెరికాలోనే దాదాపుగా 80 వేల మందికి పైగా మరణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)