రూట్ మార్చిన కరోనా... చైనా నుంచి కొరియాకు...!!

రూట్ మార్చిన కరోనా... చైనా నుంచి కొరియాకు...!!

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ వైరస్ దెబ్బకు దాదాపుగా 2000 మందికి పైగా మరణించారు.  80 వేలమంది వరకు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.  అయితే, నిన్నటి రోజున కేవలం 349 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  

చైనాలో తగ్గుముఖం పడుతుండగా, ఈ వైరస్ క్రమంగా కొరియాలో పెరుగుతున్నది.  కొరియాలో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  కొరియాలో వాతావరణం కరోనా వైరస్ పెరిగేందుకు అనుగుణంగా చల్లగా ఉండటం ఇందుకు కారణం కావొచ్చు.  దీంతో కొరియా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటోంది.