చైనాకు మరో కొత్త తలనొప్పి... పెరుగుతున్న కేసులు... లక్షణాలు లేకున్నా... 

చైనాకు మరో కొత్త తలనొప్పి... పెరుగుతున్న కేసులు... లక్షణాలు లేకున్నా... 

చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.  12,86,664 మంది వైరస్ బారిన పడ్డారు.  కాగా, ఇప్పటి వరకు 70,446 మంది మరణించారు.  రోజు రోజుకు మరణాల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నది.  యూరప్ దేశాల్లో ఈ వైరస్ వలన 50వేల వరకు మరణాలు సంభవించాయి.  అమెరికాలో రోజు రోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  మరణాల సంఖ్య కూడా అదే విధంగా పెరిగిపోతున్నది.  

చైనాలో దాదాపుగా కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టింది.  దీంతో చాలా చోట్ల ఆంక్షలు ఎత్తివేశారు. ఆంక్షలు సడలించిన ప్రాంతాల్లో మళ్ళీ కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్నది.  ఈసారి కరోనా వ్యాధి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.  అయితే, గతంలో ఉన్న వ్యాప్తి ఇప్పుడు లేకపోయినా, కఠిన చర్యలు తీసుకుంటే మంచిది.  ఇప్పుడు ఆంక్షలు సడలిస్తే దాని వలన మరలా ప్రమాదాలు సంభవించే సంభవించే అవకాశం ఉంటుంది.