కావలి కరెంట్ ఆఫీస్ లో కరోనా కలకలం... ఆందోళనలో ఉద్యోగులు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అటు నెల్లూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మొన్నటి వరకు నెల్లూరు, కావలి తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేశారు. ఇక ఇదిలా ఉంటె, కావలి కరెంట్ ఆఫీసులు కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా సోకింది. ఆఫీస్ లో ఐదు మందికి కరోనా సోకడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన ఐదుగురు ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించారు. ఇక ఇదిలా ఉంటె తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం నెల్లూరు జిల్లాలో కొత్తగా 669 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16169కి చేరింది. ఇందులో 5317 కేసులు యాక్టివ్ గా ఉంటె, 10721 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు 131 మంది కరోనాతో మరణించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)