అంతర్వేదిలో కరోనా కలకలం...

అంతర్వేదిలో కరోనా కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది.  అంతర్వేదిలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలోని రథం దగ్ధం కావడంతో రగడ మొదలైంది.  అప్పటి నుంచి రాష్ట్రంలోని అనేక హిందూ సంఘాలు దీనిపై గొడవ చేస్తున్నాయి.  ప్రభుత్వం దీనిని సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించింది.  రథం దగ్ధం కేసులో అంతర్వేదిలో డ్యూటీ చేస్తున్న అనేక మంది పోలీసులకు కరోనా సోకింది.  డ్యూటీలో ఉన్న పోలీసులకు ఇటీవలే టెస్టులు నిర్వహించారు.  ఈ పరీక్షల్లో అనేకమంది పోలీసులకు కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.   విచారణాధికారి  ఎస్పీ కరణం కుమార్, ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు సీఐ, డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  కరోనా సోకిన పోలీసులను క్వారంటైన్ కు తరలించారు.