నెల్లూరు జిల్లా కోవిడ్ సెంటర్ లో అత్యంత అరుదైన ఘటన

నెల్లూరు జిల్లా కోవిడ్ సెంటర్ లో అత్యంత అరుదైన ఘటన

నెల్లూరు జిల్లాలో రీజనల్ కోవిడ్ సెంటర్ లో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే కోవిడ్ బారిన పడిన ఇద్దరు గర్భిణీలకు ఒకే రోజు డెలివరీ చేశారు వైద్యులు. కోవూరు మండలం చిన్న పడుగు పాడుకు చెందిన కోవిడ్ బారిన పడిన గర్భిణీకి నెలలు నిండడంతో జిజిహెచ్  వైద్యులు శ్రమించి విజయవంతంగా డెలివరీ చేశారు. 3.5 కేజీల బరువుతో పుట్టిన బాబు ఆరోగ్యవంతంగా ఉన్నారు. అలానే ఇందుకూరుపేటకు చెందిన మరో గర్భిణీ మహిళకు నార్మల్ డెలివరీ అయింది ఇక్కడ కూడా బాబు ఆరోగ్యవంతంగా ఉన్నారు. జిజిహెచ్ లో ఇద్దరు కోవిడ్ బారిన పడిన ఇద్దరు గర్భిణీలకు విజయవంతంగా డెలివరీ చేసిన డాక్టర్లను‌ ఉన్నతాధికారులు అభినందించారు.