శిక్షణ శిబిరం నుండి ఆసుపత్రికి భారత ఆటగాడు...

శిక్షణ శిబిరం నుండి ఆసుపత్రికి భారత ఆటగాడు...

కరోనా తో బాధపడుతున్న భారత హాకీ ఆటగాడిని శిక్షణ శిబిరం నుండి ఆసుపత్రికి తరలించారు. వాయిదా పడిన ఒలంపిక్స్ కోసం బెంగళూరులో జాతీయ జట్టుకు శిక్షణ శిబిరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అందులో శిక్షణ తీసుకుంటున్న భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్ అలాగే మన్‌దీప్‌ సింగ్‌ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్‌ఐఐ తెలిపింది. దాంతో వారందరిని అక్కడే శిక్షణ శిబిరంలోనే ఒంటరిగా క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాంతో రోజులాగే నిన్న కూడా వారందరిని పరీక్షించగా మన్‌దీప్‌ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్‌ఐఐ తెలిపింది.