ఏలూరులో దారుణం.. హోం ఐసోలేష‌న్‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌..

ఏలూరులో దారుణం.. హోం ఐసోలేష‌న్‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌..

క‌రోనావైర‌స్ సోక‌డం ఏమో కానీ.. అది వ‌చ్చింద‌నే భ‌య‌మే కొంద‌రి ప్రాణాలు తీస్తోంది.. ఇంట్లో వాళ్ల‌కు క‌రోనా సోకితే.. త‌న‌కు కూడా ఎక్క‌డ వ‌స్తుందోన‌నే ఆందోళ‌నతో కూడా కొంద‌రు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.. తీరా ఆరా తీస్తే.. క‌రోనా భ‌య‌మే ఆ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేలా చేసింది.. ఫిలాస్‌పేటలో క‌రోనా పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న నేత‌ల ఐశ్వ‌ర్య‌రాజు అనే యువ‌కుడు.. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మ‌రోవైపు.. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో.. యువకుడి తల్లిదండ్రులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 2018లో నూజివీడు ఐఐఐటీలో ఇంజనీరింగ్ సీఎస్ఈ పూర్తి చేసిన ఐశ్వ‌ర్య‌రాజు... ప్ర‌స్తుతం ఉద్యోగ‌ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రిలో ఉన్నార‌నే భ‌యం.. త‌న‌కూ పాజిటివ్ వ‌చ్చింద‌నే ఆందోళ‌న‌తో ప్రాణాలు తీసుకున్నారు.