కరోనా దెబ్బకు దొంగగా మారిన నటి

కరోనా దెబ్బకు దొంగగా మారిన నటి

కరోనా మహమ్మారి అంతా మార్చేసింది. దాదాపు పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది అంతా అనుకుంటున్నారు. చాలా మంది జీవన విధానాల్లో కూడా కరోనా ఎన్నో మార్పులు తెచ్చింది.  చాలా మంది భర్తలకు రకరకాల వంటలు నేర్పింది. ఇదిలా ఉంటే ఓ నటిని కరోనా  ఏకంగా దొంగగా మార్చింది. ప్రియుడితో కలిసి దొగతనాలకు పాల్పడుతుంది సదరు నటి.  ఇంతకు ఎవరా అందమైన దొంగ అంటే .. దేవత సహా ఇతర సీరియల్స్‌ నటించిన సుచిత్ర .ఈ అమ్మడు సీరియల్లో తననటనతో అందరిని ఆకట్టుకుంటూనే తనలో ఉన్న మరో టాలెంట్ ను కూడా బయట పెట్టింది. సహాజీవనం చేస్తున్న ప్రియుడు మణికందన్ తో కలసి దొంగతనాలు మొదలు పెట్టింది. అదికూడా ప్రియుడు మణికందన్ ఇంట్లోనే. మణికందన్ కు ఇంతకు ముందే పెళ్లి అయింది. చెన్నైలో ఉంటున్న ఇతడు టీవి,సినీ నటులకు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే  నటి సుచిత్రతో  పరిచయం ఏర్పడింది. అతడికి పెళ్లయిందని తెలిసి కూడా అతడితో సహజీవనం చేసింది సుచిత్ర. ఇక లాక్ డౌన్ వల్ల డబ్బులకు ఇబ్బంది కావడంతో సుచిత్రా ప్లాన్ మేరకు మణికందన్ తన తండ్రి ఇంటిలోనే యాబైవేలు నగదు,18. సవరాల బంగారంతో పరారీ అయ్యాడు. దాంతో మణికందన్ తల్లిదండ్రుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికందన్ ను అరెస్ట్ చేసారు. మాస్టర్ ప్లాన్ వేసిన నటి సుచిత్ర మాత్రం పరారీలో ఉంది. కడలూరు జిల్లా పన్రుతిలో ఈ ఘటన జరిగింది.