కరోనా ఎఫెక్ట్... ఆ ఊరిలోకి వెళ్తే ఫైన్ పడుద్ది...

కరోనా ఎఫెక్ట్... ఆ ఊరిలోకి వెళ్తే ఫైన్ పడుద్ది...

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటుంది.. మరోవైపు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లో పాల్గొంటున్నారు. బయటివాళ్లు తమ ఊరిలోకి రావొద్దంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.. రోడ్లకు అడ్డంగా గోతులు తీయడం, కంచె వేయడం, ట్రాక్టర్లను అడ్డంగా నిలబెట్టడం కూడా చేస్తున్నారు. ఇక, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఇతరులు లోనికి రాకుండా, ఊరి నుంచి బయటకు వెళ్లకుండా.. కట్టుబాట్లు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమాన విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామం ముందు ఓ బోర్డు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శి.