ఎట్ హోమ్ పై కరోనా ప్రభావం... 

ఎట్ హోమ్ పై కరోనా ప్రభావం... 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్నినిర్వహిస్తారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, న్యాయ, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతుంటారు. గవర్నర్ ఈ విందును ఏర్పాటు చేస్తారు.  స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్నది.  అయితే, ఈసారి జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంపై కరోనా ఎఫెక్ట్ పడింది.  కరోనా నేపథ్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం లేదని రాజ్ భవన్ ప్రకటించింది.  కోవిడ్ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.