కరోనా ఎఫెక్ట్: లోకల్ ట్రైన్స్ నిలిపివేత... 

కరోనా ఎఫెక్ట్: లోకల్ ట్రైన్స్ నిలిపివేత... 

కరోనా ప్రభావం దేశంలోని వివిధ రాష్ట్రాలపై బాగానే ప్రభావం చూపుతున్నది.  ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విధ్యావ్యవస్థలు మూతపడ్డాయి.  విధ్యావ్యవస్థలు మూతపడటంతో పాటుగా రద్దీగా ఉండే ప్రాంతాలలో జన సమూహం ఎక్కువగా లేకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేసింది.  దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా మహారాష్ట్ర పై ఉన్నది.  మహారాష్ట్రలో మొత్తం 39 కేసులు నమోదయ్యాయి.  రోజు రోజుకు వైరస్ ప్రభావం పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

దీంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే ముంబై, పూణే, నాగపూర్ తదితర ప్రాంతాల్లో అన్నింటిని మూసేసింది.  కాగా, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.  అదేమంటే, ముంబై నగరంలో లోకల్ ట్రైన్స్ ను నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది.  ముంబై లోకల్ ట్రైన్స్ ద్వారా నిత్యం లక్షలాది మంత్రి ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.  ఈ రైళ్లలోనే అత్యధిక రద్దీ ఉంటుంది.  ఇప్పుడు వీటిని క్లోజ్ చేయడం ద్వారా ప్రజలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది.  కానీ, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వం చెప్తున్నది.