నిర్బంధం దిశగా మహారాష్ట్ర... 

నిర్బంధం దిశగా మహారాష్ట్ర... 

మహారాష్ట్రను కరోనా అతలాకుతలం చేస్తున్నది.  ఇప్పటికే ఆ రాష్ట్రంలో మొత్తం 39 కేసులు నమోదుకాగా, ఒక మరణం సంభవించింది.  క్రమక్రమంగా ఈ సంఖ్య పెరిగిపోతుండటంతో మహా సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. మహారాష్ట్రలో ఇప్పటికే స్కూల్స్, పార్క్స్, సినిమా థియేటర్స్, మాల్స్ అన్ని మూసేశారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు తప్పించి అన్నింటిని క్లోజ్ చేస్తున్నారు.  

అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో పాటుగా ఇప్పుడు మెట్రో, స్టేట్ బస్ సర్వీలను కూడా క్లోజ్ చేసే దిశగా మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  దీనిపై ప్రస్తుతం మహా సర్కార్ హైలెవల్ మీటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంలోగా మహారాష్ట్ర సర్కార్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.