ఇండియాలో నాలుగు వేలు దాటేసిన కరోనా కౌంట్

ఇండియాలో నాలుగు వేలు దాటేసిన కరోనా కౌంట్


భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 693 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,067కు చేరింది. ఈ మొత్తం కేసుల్లో 1,445 కేసులు దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించివేనని ప్రకటించారు. ఇక వైరస్ సోకిన వారిలో 76 శాతం మంది పురుషులు. 24 శాతం మంది మహిళలు. చనిపోయిన వారిలో 73 శాతం మంది పురుషులు, 27 శాతం మంది మహిళలు ఉన్నారని చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 109 కరోనా మరణాలు సంభవించాయి. వారిలో 63 శాతం మంది 60 ఏళ్ళ పైబడిన వారని ఆరోగ్య శాఖ తెలిపింది.