తెలంగాణ రాష్ట్రంలో భారీగా కేసులు...700 +

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కేసులు...700 +

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రోజూ రికార్డు స్థాయిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 730 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802 కి చేరింది. కరోనాతో ఇవాళ ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 210 కి చేరింది. నమోదైన మొత్తం కేసుల్లో 3,861 కేసులు యాక్టివ్ గా ఉంటె, 3,731 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

ఈరోజు నమోదైన 730 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 659 కేసులు ఉన్నాయి. రంగారెడ్డిలో 10, జనగాం 34, మేడ్చల్ లో 9, ఆసిఫాబాద్ 3, వరంగల్ అర్బన్  6, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాది, నారాయణ్ పేట్, మెదక్, నల్గొండ, యాదాద్రిలలో 1 కేసు చొప్పున నమోదైంది. కొద్దిరోజుల క్రితం వరకూ 200కు మించని కేసులు, ఇప్పుడు టెస్టులు బాగా పెంచడం వలన భారీగా నమోదవుతున్నాయి.