వ్యాక్సిన్ వ‌చ్చినా... అగ్ర‌రాజ్యంలో మార‌ని తీరు... 

వ్యాక్సిన్ వ‌చ్చినా... అగ్ర‌రాజ్యంలో మార‌ని తీరు... 

ప్రపంచంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.  కొన్ని దేశాల్లో వైరస్ ఉదృతి తగ్గినా, అమెరికా, యూరప్, బ్రెజిల్, రష్యా వంటి దేశాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజు ప్రపంచం మొత్తం మీద 6,28,938 కరోనా కేసులు నమోదుకాగా, 12,789 కరోనా మరణాలు సంభవించాయి.  ఇక ఒక్క అమెరికాలోనే నిన్నటి రోజున 1,95,809 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,99,085కి చేరింది.  ఇక నిన్నటి రోజున అమెరికాలో 3,353 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో అమెరికాలో సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,05,237కి చేరింది.  అమెరికాలో ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయినప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు. పైగా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్లపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.  ఫిబ్రవరి మొదటి వారం నాటికి కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.  మరో మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అయన కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది.