ఒక్క రోజులోనే 99 కొత్త కరోనా కేసులు... 

ఒక్క రోజులోనే 99 కొత్త కరోనా కేసులు... 

కరోనా ఈ పేరు ప్రపంచాన్ని భయపెడుతున్నది.  ప్రపంచానికి పెను సవాల్ గా మారింది.  కరోనా బారిన పడిన వ్యక్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  ఇప్పటికే 3,79,80 కరోనా కేసులు నమోదమయ్యాయి.  ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ సమూహాలను కంట్రోల్ చేయడంలో ఆయా దేశాలు విఫలం కావడంతో కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు ఎక్కువయ్యారు.  

ఇక ఇండియాలోను కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  మొన్నటి వరకు  రోజుకు 10 లేదా 20 కొత్త కేసులు నమోదు అవుతూ వచ్చేవి.  కానీ, నిన్న ఒక్కరోజున దేశంలో 99 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియాలో మొత్తం 499 కేసులు నమోదయ్యాయి.  ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో సోషల్ ప్రజలు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. నిన్నటి రోజున కేరళలో 28, మహారాష్ట్రలో 23 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో కేరళలో లాక్ డౌన్ ప్రకటించింది.  మహారాష్ట్రలో 144 సెక్షన్ అమలు జరుగుతున్నది.  గుజరాత్ రాష్ట్రం కూడా లాక్ డౌన్ ను ప్రకటించింది.