మరో మూడు నెలలు కీలకం.. పండగ ముఖ్యమే కానీ !

మరో మూడు నెలలు కీలకం.. పండగ ముఖ్యమే కానీ !

వరదలు, కరోనా పై కోటిలో హెల్త్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. డీఎంఈ రమేష్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావులు ఈరోజు కరోనా పరిస్థితి గురించి మాట్లాడారు. ముందుగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సమస్యలు ఉన్నాయి.. కరోనా, వరదలు ఉన్నాయని వీటి వలన జీహెచ్ఎంసి దాని చుట్టూ పక్కల ప్రాంతాలు సఫర్ అవుతున్నాయని అన్నారు. ఏడెనిమిది నెలలుగా 0.57 శాతం డెత్ రేట్ ఉందని, సుమారు 90 శాతం రికవరీ రేట్ ఉందని అన్నారు. ఇప్పటిదాకా 38 లక్షల పైగా టెస్ట్ లు చేసామని, పండగల సీజన్ కావడంతో ఇప్పుడు పండుగలు వరుసగా ఉన్నాయని, రాష్ట్రంలో ఇతర జిల్లాలో పండగ వాతావరణం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

.డిసెంబర్ వరకు కీలకమైన రోజులని  షాపింగ్, ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పండగ చేసుకోవడం...  వీటి ద్వారా ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుంది జాగ్రత్త అని హెచ్చరించారు. లక్షణాలు లేనివాళ్ళ  వల్ల కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ఆయన అన్నారు. కేరళ, ఢిల్లీ ప్రత్యేక్ష సాక్ష్యం.. తగ్గి మళ్ళీ కేసులు పెరిగాయి. కేరళలో జరిగిన ఓనమ్ పెస్టివల్ వల్ల కేసులు 10 వేల కేసులు పెరిగాయని, పండగ చేసుకోవద్దని చెప్పడం లేదు.. కుటుంబ సభ్యులతో చేసుకోండని అన్నారు, కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలీదు.. వచ్చినా ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదు కాబట్టి కట్టడి అనేది చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. అందుకే స్పెషల్ క్యాంపెయిన్ ను ప్రారంభించామని సోషల్ మీడియా, రేడియో లలో ప్రకటనలు ఇస్తున్నామని అన్నారు.