ఆ రోడ్డుపై వెళ్తున్నారా జాగ్రత్త... రోడ్డు పేరు తెలుసుకొని వెళ్ళండి... ఎందుకంటే...!!

ఆ రోడ్డుపై వెళ్తున్నారా జాగ్రత్త... రోడ్డు పేరు తెలుసుకొని వెళ్ళండి... ఎందుకంటే...!!

రోడ్డుపై వాహనాలు దూసుకుపోతుంటాయి.  ఏ రోడ్డుపై వెళ్తున్నారు అనే విషయం అనవసరం.  గమ్యస్థానానికి చేరుకునే రోడ్డు అని తెలిసిన తరువాత దాని మీద వెళ్లడమే తెలుస్తుంది.  లాక్ డౌన్ సమయంలో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.  ఇలానే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో కూడా ఆగిపోయింది.  కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్డును మాండవా గ్రామం నుంచి లక్ష్మివాది వరకు గ్రామస్తులు రోడ్డును వేసుకున్నారు.  

అంతేకాదు, ఆ రోడ్డుకు కరోనా 2020 అనే పేరు పెట్టారు. రోడ్డుపక్కన సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు.  కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సైన్ బోర్డును చూసి వాహనదారులు షాక్ అవుతున్నారు.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.