భార్య, పిల్లలను చితకబాదిన కానిస్టేబుల్‌

భార్య, పిల్లలను చితకబాదిన కానిస్టేబుల్‌

నేరం చేసిన వారిని నిలదీయాల్సిన ఓ కానిస్టేబుల్‌ తప్పుదారి పట్టాడు. తన ఇంట్లో భార్య, పిల్లలను నిర్బంధించి చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తకోటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలియడంతో ఆయన భార్య నిలదీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన చిరంజీవి.. 'నన్నే ప్రశ్నిస్తావా..' అంటూ ఆమెను చితకబాదాడు. విషయం తెలియడంతో బంధువులు అడ్డుకున్నారు. చికిత్స కోసం ఆమెను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు