లైట్ తీసుకునే కాంగ్రెస్ దుబ్బాకను సీరియస్ గా తీసుకుందా ?

లైట్ తీసుకునే కాంగ్రెస్ దుబ్బాకను సీరియస్ గా తీసుకుందా ?

ఉప ఎన్నికలను ఎప్పుడూ లైట్ గా తీసుకునే కాంగ్రెస్ దుబ్బాక ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో సాదా సిధాగా పోటీ చేయడం... జిల్లా నాయకుల కు అప్పగించేది. కానీ దుబ్బాక ఎన్నికలకు మాత్రం చాలా ప్రిపేర్ అయ్యింది. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దాని కంటే ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటుంది ఉత్తమ్ టీం. అభ్యర్థి బలమైన వాడైతే అధికార పార్టీతో గట్టిగానే పొట్లాడవచ్చని లెక్కలు వేసింది. టీఆర్ఎస్ లో ఉన్న ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కి గాలం వేసింది. అక్కడి నుండి కాంగ్రెస్ ఉప ఎన్నికలకు ప్లాన్ సిద్ధం చేసుకుంది.

ముత్యం రెడ్డి కి ఉన్న ఇమేజ్ .. శ్రీనివాస్ రెడ్డి ని బరిలో నిలిపితే గౌరవ ప్రదంగా ఎన్నికలు ఉంటాయని భావించింది. దింతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ... శ్రీనివాస్ రెడ్డి ని లైన్ లో పెట్టి పీసీసీ తో పార్టీ కండువా కప్పించేశారు. దింతో అప్పటి వరకు ఎన్నికల పై కాన్ఫిడెన్క్ కూడా లేని కాంగ్రెస్ లో చిన్న ఆశ మాత్రం వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ కంటే వెనక పడి పోతే ... భవిష్యత్ కి కష్టమని భయపడింది. కానీ ముత్యంరెడ్డి ఇంటి నుండి అభ్యర్థి అవ్వడంతో టీఆర్ఎస్ కి గట్టి పోటీని ఇస్తామని ధీమా వచ్చింది.

అభ్యర్థి ఎంపిక తరవాత... ప్రచారం పై కూడా సీనియర్ నాయకులంతా కసరత్తు చేశారు. గ్రామానికి ఓ నాయకుడు .. మండలానికి నలుగురు సీనియర్ల కు బాధ్యతలు ఆప్పగించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా దుబ్బాక మండలం బాధ్యతలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. దామోదర రాజనర్సింహ... షబ్బీర్ అలీ. సీఎల్పీ నేత భట్టి లాంటి వాళ్లంతా ఇంఛార్జీలుగా బాధ్యతలు తీసుకున్నారు. గ్రామం యూనిట్ గా నాయకులను రంగంలోకి దించింది. ఎక్కడి వారు అక్కడే ఉండటం... ప్రవుత్వం వైఫల్యాలు... ముత్యం రెడ్డి అభివృద్ధి పనులు చెప్పడం అజెండాగా పెట్టుకున్నారు.

రాష్ట్ర పార్టీ ఇంఛార్జి ఠాగూర్ కూడా ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు నియోజకవర్గం లో పర్యటించారు. నాయకుల పర్యటనతో నియోజకవర్గ క్యాడర్ లో కొంత ఆత్మస్థైర్యం పెరిగింది. గడిచిన రెండు ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఈ సీటు గురించి పట్టించుకోలేదు. ముందస్తు ఎన్నికల్లో జనసమితికి సీటు వదిలేసింది కాంగ్రెస్. దింతో క్యాడర్ కూడా కొంత సైలెంట్ అయ్యింది. ఇప్పుడు ఉప ఎన్నికలు రావడంతో.. మళ్ళీ పార్టీ క్యాడర్ ని జమచేసే పనిలో పడింది పార్టీ. గతంలో కంటే మెరుగైన ఫలితం వస్తుందనే ధీమా మత్గ్రామ్ పార్టీ లో కనిపిస్తోంది.  ఇప్పుడు ఫలితం ఎలా ఉన్నా... భవిష్యత్ మాత్రం మనదే అనే ధీమా తో ఉంది. 
 
ప్రచారం కూడా... సిద్దిపేట...గజ్వెల్ ఎలా ఉన్నాయి... దుబ్బాక ఇలా ఎందుకు ఉంది... అనే అజెండా నే ఎత్హుకుంది కాంగ్రెస్. దీనికి తోడు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి... సెంటిమెంట్ ని తెర మీదకు తెచ్చింది. ఇది కొంత పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు నేతలు. అధికార పార్టీ నుండి మంత్రి హరీష్ రావు అన్ని తానై నడిపించడం తో... కాంగ్రెస్ నాయకులు అంతా... హరీష్ టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు.

సిద్దిపేట లో జరిగిన అభివృద్ధి దుబ్బాక కి ఎందుకు చేయలేదని అంశాన్ని ప్రచారంలో పెట్టింది కాంగ్రెస్. అయితే రాష్ట్ర రాజకీయను దృష్టిలో పెట్టుకుని... దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ని ఎదిరించలేక పోయినా.... రెండో ప్లేస్ లో ఉన్నా... పార్టీ కి మేలని భావనలో ఉంది. బీజేపీ ఓ వైపు రాష్ట్రంలో బలపడాలని ప్లాన్ వేస్తున్న నేపథ్యంలో... దుబ్బాకలో బీజేపీ రెండో ప్లేస్ లోకి వస్తే కాంగ్రెస్ కి రాజకీయంగా ఇరకాటంలో కి నెట్టినట్టు అవుతోంది. అధికార పార్టీ కి అన్ని హంగులు ఉండటం చాలా అంశాల్లో కలిసి వచ్చినా... తక్కువ వనరులు ఉన్నా కనీసం గౌరవ ప్రదంగ ఫలితాలు రావాలని చూస్తోంది కాంగ్రెస్.
 
అధికార పార్టీ పెద్ద మొత్తములో డబ్బు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే... పార్టీని వనరులు లేకపోవడంతో గ్రామాల వారీగా నాయకులకు బాధ్యతలు ఆప్పగించింది పార్టీ. స్థానికంగా అయ్యే ఖర్చులు గ్రామ బాద్యులనే భరించాలని సూచించింది. మండల ఇంఛార్జీలు... ఏదైనా సాయం చేసేలా చూడాలని కూడా పార్టీ దిశా నిర్దేశం చేస్తోంది. ఇలా అభ్యర్థి మీద ఆర్థిక భారం పడకుండా చూడాలని చూస్తోంది. రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉంటే.... ఎమోస్తుందనే చర్చ కూడా ఉంది.

అయితే నాయకత్వం లోకల్ గా ఉంటే... క్యాడర్ కొంత దైర్యంగా ఉండటం...నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్న ఇండికేషన్ కూడా పంపాలని చూస్తుంది పార్టీ. ఐతే ఇవన్నీ ఈమేరకు వర్కట్ అవుతాయన్నది అసలు ప్రశ్న. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ... ప్రభుత్వ వైఫల్యం... చెరుకు ముత్యం రెడ్డి ఓటు బ్యాంకు ని నమ్ముకుంది. బీజేపీ ని కట్టడి చేయడం కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యం. అదే పనిలో ఉంది రాష్ట్ర నాయకత్వం. అధికార పార్టీకి లింగారెడ్డి సెంటిమెంట్...కాంగ్రెస్ కి ముత్యం రెడ్డి సెంటిమెంట్.!!