2023 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్...

2023 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్...

2023 లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.  దీనికోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఠాకూర్ ఓ కొత్త యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసింది.  రాష్ట్రంలోని 700 మండలాల్లో ప్రతి నాయకుడు 10 మండలాల బాధ్యతను తీసుకునేలా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు.  2023 ఎన్నికల వరకు ఆ 10 మండలాల బాధ్యతను సదరు నాయకుడే చూసుకోవాలి.  ఏ మండలం బాధ్యతను ఎవరు తీసుకోవాలి అనే దానిపై ఓ నివేదికను సిద్ధం చేయాలని పీసీసీకి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సూచించారు.  దీనికి సంబంధించిన 70 మంది సీనియర్ నాయకుల జాబితాను త్వరలోనే పీసీసీ రెడీ చేయబోతున్నది. ఈ జాబితా సిద్దమైన తరువాత రాష్ట్రంలోని సమయాలపై దృష్టి పెట్టి, ఒక్కో సమస్యకు ఒక్కో సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పేర్కొన్నారు.