గ్రేటర్ వార్: కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం... 

గ్రేటర్ వార్: కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం... 

అధికార టిఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈరోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.  తెరాస,బీజేపీలపై విమర్శలు గుప్పించారు.  ఓట్లు అడిగే హక్కు టిఆర్ఎస్, బీజేపీకి లేవని అన్నారు.  హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఐటి హబ్, రింగ్ రోడ్డు, మెట్రో, గోదావరి, కృష్ణా జలాలు నగరానికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.  హైదరాబాద్ నగరానికి బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని అన్నారు.  టిఆర్ఎస్ నాయకులు దొంగల ముఠాగా మారి వరద సహాయాన్ని మింగేశారని అన్నారు.  జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.50వేలు వరద సహాయం చేస్తామని అన్నారు.  ఇక కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని హామీ ఇచ్చారు.  నరేంద్ర మోడీ ఏడేళ్ల కాలంలో హైదరాబాద్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.  బీజేపీ, ఎంఐఎం లు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.  ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.