జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్ష రెండోరోజుకు చేరుకోగా.. దీక్ష శిబిరంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే... రాజకీయాల నుండి తప్పుకోవాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక గతంలో టీఆర్ఎస్ పార్టీ వీడటం తప్పే... ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలదీ తప్పే నన్న ఆయన... తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు నాయకత్వం  వైఫల్యం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి... ఎమ్మెల్యేలు తమ సొంత అవసరాల కోసం పార్టీ మారితే... దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారు..? రాహుల్ గాంధీ ఏం చేస్తారు? అని మండిపడ్డారు.