టీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయశాంతి చురకలు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయశాంతి చురకలు

హైదరాబాద్: తెలంగాణలో దుబ్బాక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అందులో గెలిచేందుకు ఇరు వర్గాలు తమతమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని చురకలు వేశారు. ‘టీఆర్ఎస్ తన అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తోంది. తన స్వలాభాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటోంది. ఈ ఎన్నికల కోడ్ రాకముందే గెలుపుకోసం అనేక మార్గాలను వెతుకుతోంది. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయినట్లు ప్రజలు భావిస్తున్నార’ని ఆమె అన్నారు. అయితే ఇటువంటి సమయాల్లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదన్న ఆలోచనలు ప్రజల్లో వస్తున్నాయని అన్నారు. దీనిని తెలంగాణా ప్రదేశ్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా విజయశాంతి తన సర్వేలో రాసుకొచ్చారు.