సాగర్ బైపోల్.. టీఆర్ఎస్, బీజేపీకి భయం పట్టుకుంది..!

సాగర్ బైపోల్.. టీఆర్ఎస్, బీజేపీకి భయం పట్టుకుంది..!

ప్రజాస్వామ్యన్ని నిలబెట్టడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించానికి నాగార్జునసాగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజా మంత్రి, ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి.. సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.. టీఆర్ఎస్ వైఫల్యాలను తెలియజేస్తూ.. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టని విషయాలు తెలియజేస్తూ... టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే ఎన్నికలు ఇవేనన్న ఆయన.. జానారెడ్డి అభివృద్ధి ఏమీచేయలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. మరి ఏమీ చేయకపోతే నన్ను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. 

2018 ఎన్నికలో ఓటమిపై స్పందించిన ఆయన.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. టెక్నికల్ సమస్య.. ప్రజాభిమానం ముఖ్యం అన్నారు.. తమ హయాంలో లక్షా 65 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గుర్తుచేసిన జానారెడ్డి.. తాను అభివృద్ధి చేయలేదనిచెప్పే హక్కు టీఆర్ఎస్ నేతలకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. జానారెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలందరికి తెలుసన్న ఆయన.. జానారెడ్డి గతం... టీఆర్ఎస్ భవిష్యత్ అని టీఆర్ఎస్ నేతలు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, టీఆర్ఎస్‌కు, మోడీకి భయం పట్టుకుందన్న జానారెడ్డి.. సాగర్‌లో కాంగ్రెస్ గెలవడం అంటే  ప్రజా చైతన్యానికి గీటురాయిగా అభివర్ణించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఏ పార్టీ పోటీ కాదన్న జానారెడ్డి.. నాకు పోటీచేసిన అభ్యర్థులు అందరూ పోటీయేనని.. ప్రజల విశ్వాసమే నాకు ముఖ్యం అన్నారు. ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది... ఈ ఎన్నికల్లో ప్రత్యేకతను చాటి చెప్పి ప్రజలు ఒక మలుపునకు నాంది పలుకుతారన్నారు..