పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది... పోలవరం స్పిల్ ఛానెల్లో మళ్లీ కాంక్రీట్ పనులు మొదలుపెట్టారు.. 2020 జూలైలో వచ్చిన వరదలతో స్పిల్ ఛానెల్ మట్టి, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి... దాదాపు 3 టీఎంసీలకు పైగా వరదనీరు నిలిచిపోయింది.. అయితే, 2020 నవంబర్ 20 నుంచి వరదనీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు.. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు షురూ చేశారు.. ఇప్పటికే రెండున్నర టీఎంసీల వరద నీటిని గోదావరి నదిలోకి పంప్ చేసింది నిర్మాణ సంస్థ. ఇక, ఇవాళ స్పిల్ ఛానెల్లో కాంక్రీటు పనులతో పాటు మట్టి తవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని పూర్తి కాగా.. స్పిల్ ఛానెల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు.. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు ఈ ఏడాది జూన్ నెలలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.. మొత్తంగా ఈ ఏడాది జూన్‌ వరకూ ఈ కాంక్రీట్ పనులు పూర్తయితే స్పిల్‌ ఛానల్‌ నిర్మాణం పూర్తయినట్లే.. మిగతా పనులను డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనని భావిస్తున్నారు.. వచ్చే ఏడాది ఖరీప్‌ సీజన్‌ అంటే జూలై నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించడమే టార్గెట్‌గా పెట్టింది వైసీపీ సర్కార్.