ఎన్డీఆర్ఎఫ్ కు భూములు అప్పగించిన రైతుల ఆందోళన... ఎందుకంటే..?

ఎన్డీఆర్ఎఫ్ కు భూములు అప్పగించిన రైతుల ఆందోళన... ఎందుకంటే..?

ఎన్డీఆర్ఎఫ్ కు అప్పగించిన తమ భూములకు పరిహారం వెంటనే చెల్లించాలంటూ కృష్ణా జిలాలోని రైతులు ఆందోళన చేస్తున్నారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో రోడ్డుపై బైఠాయించారు రైతులు. దాంతో విజయవాడ-నూజివీడు రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భూములు అప్పగించి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పరిహారం చెల్లించని పక్షంలో తమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.