ప్రభుత్వలాంఛనాలతో 'గీతం' మూర్తి అంత్యక్రియలు

ప్రభుత్వలాంఛనాలతో 'గీతం' మూర్తి అంత్యక్రియలు

గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గీతం విద్యాసంస్థల సమీపంలో అంతిమ సంస్కారాలు జరిపారు. అంతకు ముందు ఆయన నివాసం నుంచి  గీతం విద్యాసంస్థల వరకూ అంతిమయాత్ర కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, నారా లోకేశ్‌, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మూర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎంవీవీఎస్ మూర్తి అంతిమసంస్కారాల కోసం ప్రభుత్వం 1,316 చదరపు గజాల స్థలాన్ని మార్కెట్‌ విలువ ఆధారంగా కేటాయించింది. ఈ స్థలాన్ని మూర్తి స్మారకంగా కుటుంబ సభ్యులు అభివృద్ధి చేయనున్నారు.