మానవ భావోద్వేగాలతో వ్యాపారం

 మానవ భావోద్వేగాలతో వ్యాపారం

కాదేది కవితకు అనర్హం అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ...వ్యాపారినికా కాదేది అనర్హం అని ఇప్పడు  సామ్రాజ్యవాదలు అంటున్నారు.. ఫాదర్స్ డే, లవర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్స్ డే… అన్ని దినాలూ కాదేది వ్యాపారానికి అనర్హం అంటున్నారు నేటి బహుళజాతి కంపెనీలు...

ప్రకృతియే కాదు, మానవ సంబంధాలు వారి భావోద్వేగాలు కూడా నేడు వ్యాపారంగా మారాయి...పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే...అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు..సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు ప్రజల భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలుగుతున్నాడు... ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు...

బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని డబ్బులుగా మార్చుకోవడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రెడీ. అమ్మని ఇష్టపడని వారెవ్వరు? ఆ పేగు బంధాన్నిప్పుడు “మదర్ డే” పేరుతో వ్యాపారీకరించారు. పుట్టిన రోజుకి ఎన్ని కేకులు, ఎన్ని హోటళ్ళు, ఎన్ని కంపెనీలు, మరెన్ని పార్టీలు?! ఫాదర్స్ డే, లవర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్స్ డే… అన్ని దినాలూ వ్యాపారాదాయాలను పెంచేవే...అనేక ప్రతేక రోజుల పేరిట సరుకులు అమ్ముడవుతున్నాయి... పుస్తకాలు, పోస్ట్ కార్డులు, ఫ్లవర్ వాజ్‌లు, మెమెంటోలు, రిప్లికలు, లోహపు బొమ్మలు, పేపర్ వెయిట్‌లు, యాష్ ట్రేలు, క్యాలెండర్లు, దుప్పట్లు, టాయిలెట్ పేపర్లు, షోకేసు బొమ్మలు, సావనీర్లు, రగ్గులు చివరికి కండోమ్‌లు కూడా...

కొత్త విషయమేమి కాదు. పెట్టుబడి నిత్యం వేల కళ్ళతో నేల నలుదిశలా కాపు కాస్తూ ఉంటుంది. దాని దినదిన ప్రవృద్ధికి ఏమి చేయాలో అనే నిరంతర అన్వేషణలో ఉంటుంది. పెట్టుబడికి ఉన్నత దశ అయిన సామ్రాజ్యవాదం ఇప్పుడు రాక్షస రూపం దాల్చి అనువుగా ఉన్న ప్రతిదాన్నీ తన కబంధ హస్తాలతో బంధించి భుజించి తేనుస్తుంది. దానికి తరతమ బేధాలు లేవు...ఏ ఏ అంశాలు తన వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా అన్న అనే శోచన తప్ప దానికి అంటరానిది ఏమీ ఉండదు. “ఒక దళారి పశ్చాత్తాపం” అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు. పెట్టుబడి క్రూరత్వం ఒక్కో సారి ఉదారవాద రంగు పులుముకొంటుంది. ఇంకో సారి ప్రజాస్వామిక వేషం వేస్తుంది...

ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు పుంఖానుపుంఖాలుగా అమ్మ మీద కవులు, రచయితలు రచనలు చేశారు...అమ్మకు మాతృత్వమనే కిరీటాన్ని పెట్టి ఆమెను పొగిడి ఆత్మలేని సాహిత్యాన్ని చాలానే సృష్టించారు...అమ్మ- నవమాసాలు బిడ్డను కడుపులో మోసి, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కని, బిడ్డను దేశ పౌరుడిగా అంకింతం చేయాలనే ఆమె బాధ్యత గురించే మనకు తెలుసు... కుటుంబంలో బిడ్డలు అందరూ తిన్న తరువాత మాత్రమే ఆమె తింటుందనీ, వారికి సకల సౌకర్యాలు సేవల రూపంలో యిస్తుందనీ; సమాజగర్భంలో ఆదేశిక సూత్రంగా అమలు అవుతున్న ధర్మమే జీర్ణం అయి ఉంది. వర్తమాన పరిస్థితుల్లో కళ్లకు కనిపిస్తున్న వాస్తవికత, తల్లికి అంతకంటే ఎక్కువ కర్తవ్యాన్ని సూచిస్తోంది...కుటుంబ హింసలను అనుభవిస్తూ అహోరాత్రులు పిల్లల కోసం శ్రమిస్తున్నారు. అయితే సంక్షోభ సమయాల్లో తల్లుల కర్తవ్యం అంతకంటే ఉన్నతంగా ఉంటోంది..

మథర్స్‌ డే రోజు తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వమని, మథర్స్‌డే  ప్రత్యేక గురించి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టిక్ టాక్... ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ మదర్స్ డే విషెస్‌తో నిండిపోతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అమ్మ ప్రేమను చాటుకుంటూ... పోస్టులు పెడుతున్నారు...

మథర్స్ డే అంటే అమ్మకు తప్పని సరిగా ఏదో గిఫ్ట్ ఇవ్వలని,ఇవ్వకపోతే తల్లిమీద నీకు ప్రేమ,గౌవరం లేదనే విధంగా సోషల్ మీడియా,ప్రధాన స్రవంతి మీడియా కూడా ఊదరగొడుతుంది...తల్లీ ప్రేమను తెలియచేయడానికి ఏదో ఒక ప్రత్యేక రోజు పేరుతో బహుళ జాతి కంపెనీలు వ్యాపారం నిర్వహిస్తున్నాయి...భారతదేశం లాంటి దేశాల్లో ప్రజల్లో వస్తున్న అసంతృప్తులను, నిరసనలను, పోరాటాలను కూడా ఏ మేరకు తన ప్రయోజనాలకోసం వాడుకోవచ్చో తన నిఘా నేత్రంతో నిత్యం పరిశీలిస్తూ ఉంటుంది...

రోజు రోజూకు ప్రపంచ వ్యాప్తంగా వృద్దాశ్రామాలు పెరిగిపోతూనే ఉన్నాయి...గ్లోబలైజేషన్‌ పుణ్యామా అని,న్యూక్లియర్‌ కుటుంబ వ్యవస్ధను ప్రొత్సహించిన ఈ బహుళ జాతి కంపెనీలు మరో వైపు మథర్‌ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్స్ డే పేరుతో వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరించుకుంటి...ఈ క్షణం అమ్మలకు శుభాకాంక్షలు తెలిపి మరు క్షణం నుంచి వృద్దాప్యంలో ఆమె బాగొలు చూసుకొకుండే ఆశ్రమాల్లో పెడుతున్న దుర్మార్గులు ఉన్నారు...

అమ్మకు నిజమైన అభినందనలు మీరు చెప్పె శుభాకాంక్షలు, గిప్టులు ద్వారా సంతోషాన్ని ఇవ్వదు...సమాజంలో మహిళలకు మీరు ఇచ్చే గౌరవం,ఇంట్లో మీ భార్యపట్ల మీరు అనుసరిస్తున్న విధానామే మీరు అమెకు ఇచ్చే గౌవరం...కుటుంబంలో ,సమాజంలో,రాజకీయ ఆర్థిక రంగాల్లో,భద్రత విషయంలో మీరు స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వడమే తల్లికి మనం ఇచ్చే నిజమైన గౌరవం..