కుప్పకూలిన గోల్కొండ కోట గోడ...

కుప్పకూలిన గోల్కొండ కోట గోడ...

హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. వర్షం తగ్గిన వరద మాత్రం తగ్గలేదు. తాజాగా భారీ వర్షాలకు గోల్కొండ గోడ కుప్పకూలింది. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే..పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులు పురావస్తు శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. కానీ ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ గోడ కుప్పకూలింది. ఈ విషయాన్నీ స్వయంగా అధికారులే చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు.