వింటర్ సీజన్: మృదువైన చర్మం మేనికి కొబ్బరినీళ్లు..

వింటర్ సీజన్: మృదువైన చర్మం మేనికి కొబ్బరినీళ్లు..

చలికాలంలో కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసిన శరీరానికి తిరిగి ఉత్తేజం ఇచ్చినట్లువుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అన్ని కాలాల్లో దొరికే కొబ్బరి బోండాలకు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తినిచ్చే గుణం ఉంటుంది. కొబ్బరినీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. హార్ట్ పేషెంట్స్ వీటిని తాగడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లని తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే కొబ్బరినీటిని తాగడం వల్ల శరీరరోగ నిరోధక శక్తి పెరుగుతుతుంది. దీంతో.. బాడీలోని చెడు బాక్టీరియా, వైరస్‌లు బయటికి వెళ్లిపోతాయి. తరుచుగా కొబ్బరి నీళ్లుతాగితే, పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు కూడా సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా చూస్తుంది. చలి కాలంలో చర్మకాంతిని మెరుగుపరుచడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి.