ఏపీలో జోరుగా కోడి పందాలు !

ఏపీలో జోరుగా కోడి పందాలు !

కోర్టు ఆదేశాలు ఉన్నా సరే ఏపీలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా భారీ ఎత్తున కోడి పందాలు సాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో కోళ్ల పందాల బరులు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి కాళ్ళ తదితర ప్రాంతాల్లో కోడిపందాలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో కూడా జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంబాపురంలో కూడా కోడిపందాలు జరుగుతున్నాయి. ఇక మచిలీపట్నంలో కూడా జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో కోడి పందాల బరులు భారీ ఎత్తున సిద్ధమయ్యాయి. ఇక ఈ కోళ్ల పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అలానే భారీగా పందెంరాయుళ్లు బరుల వద్ద సందడి చేస్తున్నారు.  పోలీసులు పండుగకు కొద్ది రోజుల ముందు నుండి కోడి కత్తులను స్వాధీనం చేసుకుని అప్పటికే ఏర్పాటు చేసిన బరులను పెద్ద ఎత్తున ద్వంశం చేసారు. అయినా సరే పందెం రాయుళ్ళు ఎక్కడా తగ్గకుండా పందేలకు వెళ్ళడం గమనార్హం.