100 కోట్లు పడిపోయిన ఐపీఎల్ స్పాన్సర్ ధర..  

100 కోట్లు పడిపోయిన ఐపీఎల్ స్పాన్సర్ ధర..  

ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ గా వివో తన హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు 4 రోజుల క్రితమే ప్రకటించింది. కానీ బీసీసీఐ మాత్రం వివో నిర్ణయాన్ని నిన్న ఆమోదించింది. అయితే భారత్-చైనా మధ్య  జరిగిన ఘర్షణలో 21 భారత జవాన్లు అమరులు అయ్యారు. అయితే అప్పటినుండి  చైనా వస్తువులు కొన‌కూడ‌దు. అలాగే చైనా యాప్స్ వాడ‌కూడ‌దు అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. అలాగే ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న వివో ను తొలగించాలి అని అభిమానులు బీసీసీఐ ని కోరారు. అయితే దానికి ఒప్పుకొని బీసీసీఐ వివో నే స్వయంగా ప్రకటించడంతో ఆ చైనా సంస్థను తొలగించింది. 

అయితే వివో మనకు స్పాన్సర్ గా 440 కోట్లు చెల్లించేది. కానీ ఇప్పుడు వచ్చే సంస్థలు అంతగా చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దానికి కారణం కరోనా. ఈ వైరస్ కారణంగా అభిమానులు మ్యాచ్ లకు వచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు స్పాన్సర్ గా ఉండటానికి వస్తున్న సంస్థలు అన్ని కేవలం 300-350 కోట్లు మాత్రమే చెల్లించేందుకు చూస్తున్నాయి. అంటే ఇంతకముందు కంటే దాదాపు 100 కోట్లు తక్కువ. ఇక ఈ స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకోవడానికి కోకో-కోలా సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.