కేబినెట్‌ అనంతరం మంత్రులతో సీఎం జగన్ భేటీ..

కేబినెట్‌ అనంతరం మంత్రులతో సీఎం జగన్ భేటీ..

అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపు మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ భేటీలో ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్, పొలిటికల్ కరప్షన్‌పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవద్దని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు.. సుదీర్ఘ కాలం నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సర్వీసుల్లో ఉన్నవారిని కదిలించవద్దనే అభిప్రాయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుండగా.. సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే.. 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, ప్రభుత్వంపై కరెప్షన్ ముద్ర ఎంత మాత్రం పడడానికి వీల్లేదని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. పొలిటికల్ కరెప్షన్ దాదాపు కంట్రోల్ అయినట్టు సీఎం తెలిపారు. అయితే, పొలిటికల్ కరెప్షన్ తగ్గినా... అధికారుల స్థాయిలో కరెప్షన్ తగ్గలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు పలువురు మంత్రులు.