సీఎం యోగి మసీదు శంకుస్థాపనకు వెళ్తారా...?
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం పూర్తి చేశారు.. కరోనా సమయంలో అతితక్కువ మంది మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, అయోధ్యలో మసీదును కూడా నిర్మించనున్నారు.. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు ఓ ప్రశ్న ఎదురైంది.. అయోధ్యలో జరగబోయే మసీదు శంకుస్థాపనకు మీరు వెళ్తారా? అని ఆయను ప్రశ్నించగా... ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎవ్వరూ పిలువరు.. నేనూ వెళ్లను.. అంటూ ఆయన మనసులోని మాటను కుండ బద్ధలు కొట్టినట్టుగా చెప్పేశారు.
అయితే, ముస్లిం వ్యతిరేకిగా యోగి ఆదిత్యానాథ్పై ముద్ర ఉంది.. ప్రతిపక్షాలకు ఇదే విషయంలో ఎప్పుడూ ఆయనను టార్గెట్ చేస్తూనే ఉంటాయి.. ఆయన అవి ఏవీ పట్టించుకోకుండా తన పనిని కానిస్తారు. అయోధ్యలో రామాలయ భూమి పూజా సందర్భంగా.. యోగిని పలకరించిన ఓ జాతీయ ఛానెల్.. అన్ని మత విశ్వాసాలను గౌరవించే సీఎం యోగి... మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి... దీనిపై మీ సమాధానం ఏంటి? అని అడిగారు.. దీనిపై యోగి స్పందిస్తూ.. నన్ను ఎవరూ పిలువరు. నేనూ వెళ్లను. నా పని ఏదుందో దానిని నేను చేస్తాను. నా పనిని ధర్మంగా, కర్తవ్యంగా భావిస్తూ... పని చేస్తుంటానంటూ వ్యాఖ్యానించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)