ఓ రైతు బిడ్డగా తాను రైతు పక్షపాతినే.. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం వ్యాఖ్య

ఓ రైతు బిడ్డగా తాను రైతు పక్షపాతినే.. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం వ్యాఖ్య

రైతులకు దీర్ఘకాలంలో మేలు చేస్తాయని చెబుతూ కేంద్రం ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చింది.. లోక్‌సభ, రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదింపజేసింది మోడీ సర్కార్.. అయితే, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పోరాటాలు తీవ్రరూపంగా మారుతున్నాయి.. అయితే, ఈ ఆందోళనలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప..  రైతులంతా ఓ ఆరు నెలల పాటు వేచి చూడాలని, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కొత్త బిల్లులు వారికెలా ఉపయోగపడతాయో అప్పుడు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తానూ ఓ రైతు బిడ్డగా రైతుల పక్షపాతినేనన్న ఆయన.. అందరితో సుదీర్ఘంగా సంప్రదించిన తర్వాతే వ్యవసాయ బిల్లులను కేంద్రం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఇక, రైతు సంఘాలు, కాంగ్రెస్, జేడీఎస్.. బంద్‌లో పాల్గొనటంపై ఆయన మాట్లాడుతూ.. ఈ బంద్‌ను రాజకీయ బంద్‌గా అభివర్ణించారు. రైతుల పంటని వారు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందన్న కర్ణాటక సీఎం.. మార్కెట్ కమిటీలు లేకుండా చేయడంలేదని.. రైతులు పంటలను అక్కడ కూడా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు.