దీదీకి ఈసీ నోటీసులు.. వివరణకు డెడ్లైన్..!
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 3న హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న దెయ్యం మాటలు విని.. మైనార్టీ ఓట్లు చీలకుండా చూడండని ఆమె ప్రచారంలో అన్నారు. అలా ఓటర్లతో అనడం మతం ఆధారంగా ఓట్లు అడగటమేనని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 48గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా మమత దీదీకి నోటీసు జారీ చేసింది. ఈనెల 3న హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న దెయ్యం మాటలు విని.. మైనార్టీ ఓట్లు చీలకుండా చూడండని ఆమె ప్రచారంలో అన్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం.. కాగా, ప్రజలను ఓటు వేయనివ్వకుండా కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుంటున్నారని, వారంతా బీజేపీ మద్దతుదారులని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
వాస్తవానికి తనకు సీఆర్పీఎఫ్ అంటే చాలా గౌరవం ఉందని, నిజమైన జవాన్లను తానెప్పుడూ ఎంతో గౌరవంతో చూస్తానని అన్నారు. అయితే బీజేపీ సీఆర్పీఎఫ్ జవాన్లను తాను గౌరవించబోనని తెలిపారు. ఎన్నికల పారదర్శకత లోపిస్తోందని మండిపడ్డ మమత, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. జై శ్రీ రామ్ నినాదం వింటే మమతా బెనర్జీకి కోపం ఎందుకన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జై శ్రీరామ్ అని ఎవరైనా అంటే దీదీ కోపంతో ఊగిపోతారని మండిపడ్డారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)